Vangaveeti Radha: వంగవీటి రాధాకు గన్ మన్లను ఏర్పాటు చేయాలంటూ సీఎం జగన్ ఆదేశాలు

Gunmen for Vangaveeti Radha as per CM Jagan orders
  • రంగా వర్ధంతి సభలో రాధా సంచలన వ్యాఖ్యలు
  • తన హత్యకు కుట్ర చేస్తున్నారని వెల్లడి
  • రెక్కీ కూడా నిర్వహించారని వివరణ
  • సీఎం జగన్ కు తెలిపిన కొడాలి నాని
  • 2 ప్లస్ 2 గన్ మన్లను ఇవ్వాలన్న సీఎం జగన్
తన హత్యకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన తండ్రి వంగవీటి రంగా వర్ధంతి సభలో రాధా మాట్లాడుతూ, తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని వెల్లడించారు. రాధా ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఏపీ మంత్రి కొడాలి నాని కూడా వర్ధంతి సభలోనే ఉన్నారు. ఆయన ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సీఎం జగన్ వెంటనే స్పందించి రాధాకు భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని కొడాలి నాని స్వయంగా మీడియాకు వెల్లడించారు.

సీఎం జగన్ ను కలిసి రాధా విషయం వివరించానని, రాధా పట్ల ఆయన సత్వరమే స్పందించారని తెలిపారు. రాధా హత్యకు రెక్కీ చేసిందెవరో నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని వివరించారు. రాధాకు 2 ప్లస్ 2 విధానంలో గన్ మన్లను ఏర్పాటు చేయాలని కూడా సీఎం తన ఆదేశాల్లో పేర్కొన్నారని నాని వెల్లడించారు. ఇక, వంగవీటి రాధా వైసీపీలోకి వచ్చే విషయం తమ మధ్య చర్చకు రాలేదని కొడాలి నాని స్పష్టం చేశారు. రాధా ఎప్పుడు పార్టీలోకి వస్తానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతాం అని తెలిపారు.
Vangaveeti Radha
Gunmen
CM Jagan
Kodali Nani
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News