చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ హవా!
- 14 సీట్లలో ఆప్ జయకేతనం
- 12 స్థానాలలో గెలిచిన బీజేపీ
- ఇది మార్పుకు సంకేతమన్న కేజ్రీవాల్
మరోవైపు గత ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 12 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో విజయం సాధించగా శిరోమణి అకాలీదళ్ ఒక్క స్థానంలో గెలిచింది. ఈ ఫలితాలతో ఆప్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు మార్పుకు సంకేతమని చెప్పారు.