మంత్రి ఆదిమూలపు సురేశ్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్ 

CM Jagan attends minister Adimulapu Suresh daughter wedding reception
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కుమార్తె శ్రిష్టి వివాహం సిద్ధార్థ్ తో ఘనంగా జరిగింది. మంత్రి స్వస్థలం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పెళ్లి రిసెప్షన్ నిర్వహించగా, ముఖ్యమంత్రి సీఎం జగన్ హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ రాకతో పెళ్లి రిసెప్షన్ లో వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వెలిబుచ్చాయి. కాగా, ఈ విందు కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Go Back to Shorts
CM Jagan
Adimulapu Suresh
Wedding Reception
Yarragondapalem
Prakasam District
YSRCP
Andhra Pradesh

More Telugu News