Priyanka Chopra: ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోబోతోందనే వార్తల నేపథ్యంలో ఆమె తల్లి స్పందన!

Priyanka Chopra mother Madhu response amid divorce news
  • నిక్ జొనాస్ ఒక జీనియస్ అన్న మధు చోప్రా
  • చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడని కితాబు
  • ఇంట్లో అందరూ అతన్ని ప్రేమిస్తారని వ్యాఖ్య
తనకంటే చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ను బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ లో తన పేరు పక్కన జొనాస్ ను ఆమె తొలగించింది. దీంతో, వీరి పెళ్లి పెటాకులు కాబోతోందనే ప్రచారం ప్రారంభమయింది. ఆమె విడాకులు తీసుకోబోతోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక తల్లి మధు చోప్రా ఇన్స్టా ద్వారా స్పందించారు.
 
నిక్ జొనాస్ ఒక జీనియస్ అని మధు చోప్రా కితాబునిచ్చారు. తాను 40 ఏళ్లు డాక్టర్ గా పని చేశానని... ఇద్దరు సంతోషకరమైన పిల్లలకు తల్లినని తెలిపారు. ఒక జీనియస్ కు అత్తనని చెప్పారు. ప్రస్తుతం ఒక స్టూడియోకు మేనేజింగ్ డైరెక్టర్ నని తెలిపారు. నిక్ చాలా నెమ్మదస్తుడని, చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తాడని చెప్పారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అతన్ని ప్రేమిస్తారని తెలిపారు.
Priyanka Chopra
Nick Jonas
Break up
Divorce
Mother
Madhu Chopra

More Telugu News