ఇరుపక్షాలదీ తప్పే... క్రైస్తవులపై జరిగిన దాడులపై కర్ణాటక హోంమంత్రి స్పందన
- క్రైస్తవుల ప్రేయర్ మీటింగులపై దాడులు
- మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ దాడులు
- తప్పు రెండు వైపులా ఉందన్న హోంమంత్రి
ఈ ఘటనలపై కర్ణాటక హోంమంత్రి జ్ఞానేంద్ర మాట్లాడుతూ, తప్పు ఇరుపక్షాల వైపు ఉందని అన్నారు. ఒకవేళ వారు బలవంతపు మతమార్పిడులకు పాల్పడకపోతే మౌనంగా ఉండొచ్చని, రచ్చ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఏ ఒక్కరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని... జరిగిన దానిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్న విషయం నిజమేనని అన్నారు.