Ramana Dikshitulu: ట్విట్టర్ వేదికగా టీటీడీ ఉన్నతాధికారిపై మండిపడ్డ రమణదీక్షితులు!

Ramana Dikshitulu fires on TTD officer
  • వంశపారంపర్య అర్చకులను టీటీడీ ఉద్యోగులుగా మార్చారు
  • రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం ఉల్లంఘించారు
  • ఇక కోర్టును ఆశ్రయించడమేనా?

టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారిపై తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మండిపడ్డారు. వంశపారంపర్య అర్చకులను ఉన్నతాధికారి బలవంతంగా టీటీడీ ఉద్యోగులుగా మార్చారని ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థను పరిరక్షించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను సైతం ఉల్లంఘించి... అర్చక వ్యవస్థకు విఘాతం కలిగించారని అన్నారు. ఇక కోర్టును ఆశ్రయించడమేనా? అని ప్రశ్నించారు. అంతేకాదు దీనిపై సలహా ఇవ్వాలంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామిని ట్యాగ్ చేశారు.

  • Loading...

More Telugu News