Chiranjeevi: ఆనపకాయలు పండించిన మెగాస్టార్ చిరంజీవి... వీడియో ఇదిగో!

Chiranjeevi cultivates Bottle Gourd in his back yard
  • కొన్ని నెలల కిందట ఆనపకాయ విత్తు నాటిన చిరంజీవి
  • తన ఇంటి పెరట్లో పెద్ద పాదులా మారిందని వెల్లడి
  • రెండు కాయలు కాసిందన్న మెగాస్టార్
  • ఓ కాయ కోసి మురిసిన చిరు
ప్రకృతి చాలా గొప్పదని, ఒక్క విత్తు నాటితే అది ఎంతో మందికి కడుపు నింపుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రకృతి పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఉండాలని పిలుపునిచ్చారు. తన ఇంటి పెరట్లో ఆనపకాయ (సొరకాయ) విత్తనం నాటితే అది, మొక్క మొలిచి తీగలా మారి కాయలు కాసిందని వెల్లడించారు. తాను నాటిన విత్తు పెద్ద పాదులా మారి, రెండు కాయలు కాసిందని తెలిపారు. అంతేకాదు, స్వయంగా ఆయనే ఓ కాయను కోసి మురిసిపోయారు. తన చేత్తో వేసిన విత్తనం దిగుబడి ఇచ్చేసరికి ఆయన ఆనందం అంతాఇంతా కాదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.
Chiranjeevi
Bottle Gourd
Back Yard
Nature
Tollywood

More Telugu News