'శ్యామ్ సింగ రాయ్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

Shyam Singha Roy lyrical song released
  • 'శ్యామ్ సింగ రాయ్'గా నాని
  • రేపే ప్రేక్షకుల ముందుకు
  • ఒక కథానాయికగా కృతి శెట్టి
  • సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' రూపొందింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది. దేవదాసీ పాత్రలో సాయిపల్లవి నటించగా, టైటిల్ రోల్ ను నాని చేశాడు.

మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఒక్కో లిరికల్ సాంగును వదులుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. "తెరపైన కదిలేలా కథలేవో మొదలే .. తార నింగిదిగి నేల .. కింద నడిచేలా .. వచ్చేనిలా " అంటూ ఈ పాట సాగుతోంది.

నాని .. కృతి శెట్టిలపై చిత్రీకరించిన పాట ఇది. మిక్కీ జె మేయర్ బీట్ యూత్ ను పట్టుకునేలా ఉంది. ఆయన ఏదో మేజిక్ చేసినట్టుగా అనిపిస్తోంది. సానూ ఈ పాటను చాలా బ్యూటిఫుల్ గా .. కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. కృష్ణకాంత్ సాహిత్యం .. కార్తీక్ ఆలాపన ఆకట్టుకుంటున్నాయి.
Go Back to Shorts
Nani
Sai Pallavi
Krithi Shetty
Shyam Singha Roy Movie

More Telugu News