Nagarjun: 'బంగార్రాజు' బరిలోకి దిగడం పక్కానేనట!

Bangarraju Movie Update
షార్ట్స్‌లో చూడండి
నాగార్జున హీరోగా 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. తన సొంత బ్యానర్లో ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. చైతూ - కృతి శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది. షూటింగు మొదలుపెట్టిన దగ్గర నుంచి, చకచకా అప్ డేట్స్ వస్తున్నాయి.

దాంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు సంక్రాంతి బరిలో నుంచి 'భీమ్లా నాయక్' తప్పుకోవడం ఖరారు కావడంతో, 'బంగార్రాజు' రాదనే అనుకున్నారు. కానీ జనవరి 15కి ఈ సినిమా రావడం పక్కానే అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

అన్నపూర్ణ బ్యానర్ లోని సినిమాలను రెగ్యులర్ గా తీసుకునే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లను చూసుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ముందుగా ఈ సినిమాను ఓ మాదిరి థియేటర్లలో రిలీజ్ చేసి, అవసరమైతే పెంచుకోవచ్చనే ఆలోచనలో నాగార్జున ఉన్నారని అంటున్నారు. మొత్తానికి 'బంగార్రాజు' మాత్రం వెనక్కి తగ్గడం లేదనేది అసలు విషయం.
Go Back to Shorts
Nagarjun
Nagachaitanya
Krithi Shetty
Bangarraju Movie

More Telugu News