Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ సమాధానం!

We have given special package to AP says center
  • స్పెషల్ స్టేటస్ కు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం
  • స్పెషల్ స్టేటస్ కావాలని జగన్ కోరిన మాట నిజమే
  • విజయసాయి ప్రశ్నకు పంకజ్ చౌధురి
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ కు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని తెలిపింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధురి రాతపూర్వకంగా ఈ మేరకు స్పష్టతనిచ్చారు.

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఇటీవల నీతి అయోగ్ ను ముఖ్యమంత్రి జగన్ కోరిన సంగతి నిజమేనని చెప్పారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో కేంద్ర వాటా 90 శాతం, రాష్ట్ర వాటా 10 శాతం ఉంటుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీని రాష్ట్రానికి అందించామని చెప్పారు.
Andhra Pradesh
Special Status
Parliament
Vijayasai Reddy

More Telugu News