కడప జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్.. జీవో జారీ చేసిన ప్రభుత్వం!

  • బద్వేలును రెవెన్యూ డివిజన్ చేసిన జగన్
  • గత పర్యటన సందర్భంగా జగన్ హామీ
  • హామీని నిలబెట్టుకున్న సీఎం
కడప జిల్లా బద్వేలు పట్టణానికి తన పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ బహుమతి ఇచ్చారు. బద్వేలును రెవెన్యూ డివిజన్ గా మారుస్తూ జీవో విడుదల చేశారు. ఈ ఏడాది జులైలో బద్వేలులో జగన్ పర్యటించారు. ఆ సందర్భంగా బద్వేలును రెవెన్యూ డివిజన్ చేస్తానని హామీ ఇచ్చారు.

నాడు ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు రెవెన్యూ డివిజన్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు జీవో జారీ చేశారు. బద్వేలును రెవెన్యూ డివిజన్ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రికి ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ధన్యవాదాలు తెలిపారు. బద్వేలు నియోజకవర్గ ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.


More Telugu News

Badvel Revenue Division Kadapa District Jagan YSRCP