ఎన్టీఆర్, రాంచరణ్ లపై సల్మాన్ ఖాన్ ప్రశంసలు!
- జూనియర్ ఎన్టీఆర్ నటన చాలా సహజంగా ఉంటుంది
- చరణ్ చాలా హార్డ్ వర్కర్
- 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తారక్, చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని సల్లూభాయ్ చెప్పారు. తారక్ నటన చాలా సహజంగా ఉంటుందని కితాబునిచ్చారు.
ఇక తాను రామ్ చరణ్ ని కలిసిన ప్రతిసారి అతనికి ఏదో ఒక గాయం ఉంటుందని చమత్కరించారు. తన పాత్రల కోసం ఆయన పడే శ్రమ అలాంటిదని... సెట్స్ లో తరచుగా గాయపడుతుంటాడని చెప్పారు. చరణ్ చాలా హార్డ్ వర్కర్ అని ప్రశంసించారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని... ఈ చిత్రం విడుదలైన నాలుగు నెలల వరకు మరో సినిమాను విడుదల చేయకపోవడమే మంచిదని సరదాగా వ్యాఖ్యానించారు.