Salman Khan: ఎన్టీఆర్, రాంచరణ్ లపై సల్మాన్ ఖాన్ ప్రశంసలు!

Salman Khan praises Junior NTR and Salman Khan
  • జూనియర్ ఎన్టీఆర్ నటన చాలా సహజంగా ఉంటుంది
  • చరణ్ చాలా హార్డ్ వర్కర్
  • 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది
'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్ కార్యక్రమాల్లో సినిమా యూనిట్ బిజీగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, అజయ్ దేవగణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జొహార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తారక్, చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని సల్లూభాయ్ చెప్పారు. తారక్ నటన చాలా సహజంగా ఉంటుందని కితాబునిచ్చారు.

ఇక తాను రామ్ చరణ్ ని కలిసిన ప్రతిసారి అతనికి ఏదో ఒక గాయం ఉంటుందని చమత్కరించారు. తన పాత్రల కోసం ఆయన పడే శ్రమ అలాంటిదని... సెట్స్ లో తరచుగా గాయపడుతుంటాడని చెప్పారు. చరణ్ చాలా హార్డ్ వర్కర్ అని ప్రశంసించారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని... ఈ చిత్రం విడుదలైన నాలుగు నెలల వరకు మరో సినిమాను విడుదల చేయకపోవడమే మంచిదని సరదాగా వ్యాఖ్యానించారు.
Salman Khan
Junior NTR
Ramcharan
RRR
Tollywood
Bollywood

More Telugu News