Kidambi Srikanth: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్: ఫైనల్లో ఓటమిపాలైన కిడాంబి శ్రీకాంత్

Kidambi Srikanth loses in World Badminton Championship final
  • స్పెయిన్ వేదికగా వరల్డ్ చాంపియన్ షిప్
  • పురుషుల టైటిల్ నెగ్గిన సింగపూర్ షట్లర్ లో కీన్ యూ
  • రన్నరప్ గా నిలిచిన కిడాంబి శ్రీకాంత్
  • ఫైనల్లో 15-21, 20-22తో ఓటమి
స్పెయిన్ లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. నేడు జరిగిన పురుషుల సింగిల్స్ టైటిల్ సమరంలో శ్రీకాంత్ 15-21, 20-22తో సింగపూర్ కు చెందిన లో కీన్ యూ చేతిలో వరుసగా గేముల్లో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్ లో పేలవంగా ఆడిన శ్రీకాంత్, రెండో గేములో పోరాడినా ఫలితం లేకపోయింది. కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన కీన్ యూ... ప్రపంచ విజేతగా అవతరించాడు.
Kidambi Srikanth
Loh Kean Yew
Finals
World Badminton Championship
India

More Telugu News