బిగ్ బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ప్రారంభం
- ముగింపు దశకు చేరుకున్న బిగ్ బాస్-5
- నేడు ఫైనల్స్
- కాసేపట్లో విజేత ఎవరో తేలనున్న వైనం
- 104 రోజులకు పైగా అలరించిన రియాలిటీ షో
ఈ సందర్భంగా నాగార్జున... ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో మాట్లాడి, విన్నర్ ఎవరంటూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో లోబో మాట్లాడుతూ, తన భార్య కవలలకు జన్మనిచ్చిందని, తాను ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నానని తెలిపాడు.
ప్రియాంక స్పందిస్తూ, తాను చాన్నాళ్ల తర్వాత తన స్వగ్రామం వెళ్లి తండ్రిని కలిశానని వెల్లడించింది. కుటుంబ సభ్యులు తనను స్వాగతించిన తీరు మర్చిపోలేనని, పైగా తనకు ఇప్పుడు చాలా సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలిపింది.