Pushpa: రూ.71 కోట్ల ఓపెనింగ్స్ తో 'పుష్ప' ఆలిండియా రికార్డు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప' చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలోకి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సెట్ చేసింది. తొలిరోజున పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. 2021లో తొలిరోజే ఇంత గ్రాస్ సాధించిన భారతీయ చిత్రం మరొకటి లేదని పేర్కొంది.

ఈ నెల 17న రిలీజైన 'పుష్ప' చిత్రం బన్నీ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. నటన పరంగా బన్నీని మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం 'పుష్ప' అంటూ తమ రివ్యూల్లో వెల్లడిస్తున్నారు.
Pushpa
Gross
Opening Day
Worldwide
All India
Allu Arjun
Sukumar
Rashmika Mandanna
Tollywood

More Telugu News