Ashok Babu: అమరావతి జేఏసీ సభ వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది: ఎమ్మెల్సీ అశోక్ బాబు

MLC Ashok Babu slams YCP govt
  • నిన్న తిరుపతిలో అమరావతి రైతుల భారీ సభ
  • సభ విజయవంతమైందన్న అశోక్ బాబు
  • అమరావతి నుంచి ఇటుకను కూడా తరలించలేరని వ్యాఖ్యలు
  • మూడు ముక్కలాట ఆడుతున్నారంటూ విమర్శలు

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన సభ వైసీపీ ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు. అమరావతి నుంచి సీఎం జగన్ ఒక్క ఇటుకను కూడా తరలించలేరన్న విషయాన్ని తిరుపతి సభ చాటిచెప్పిందని తెలిపారు. సీఎం జగన్ చెబుతున్న మూడు రాజధానులతో అభివృద్ధి అంశాన్ని ప్రజలెవరూ నమ్మడంలేదని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడమే ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వ ఓటమికి నిదర్శనమని అశోక్ బాబు వివరించారు.

సీఎం జగన్ మూడు ముక్కలాటతో రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోయాయని విమర్శించారు. ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. ఓఆర్ఆర్ పరిధిని తగ్గించడం రాష్ట్రాభివృద్ధిని కుదించడమేనని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News