Nani: నాని సినిమాలో మూడో హీరోయిన్ ముచ్చటేది?

Shyam Singha Roy movie update
  • 'శ్యామ్ సింగ రాయ్'గా నాని 
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్ 
  • రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • మూడో కథానాయికగా మడోన్నా
నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రెడీ అవుతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమాలో వాసు - శ్యామ్ సింగ రాయ్ అనే రెండు పాత్రలలో నాని కనిపించనున్నాడు. ఆయన సరసన ముగ్గురు కథానాయికలు నటించారు.

శ్యామ్ సింగ రాయ్ సరసన నాయికగా సాయిపల్లవి అలరించగా, వాసు పాత్రకు జోడీగా కృతి శెట్టి కనువిందు చేయనుంది. ఇక మూడో కథానాయికగా మడోన్నా సెబాస్టియన్ నటించింది. చైతూ 'ప్రేమమ్' సినిమా ద్వారా ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమైంది. మళ్లీ ఆమె పేరు ఈ సినిమాకే వినిపించింది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఎక్కడా ఈ అమ్మాయికి సంబంధించిన ప్రస్తావన వినిపించడం లేదు .. కనిపించడం లేదు. కావాలని ఈ అమ్మాయి పాత్రను గోప్యంగా ఉంచుతున్నారా? లేదంటే అంత ప్రాముఖ్యత కలిగిన పాత్రను ఆమె చేయలేదా? అనే విషయమే అర్థం కావడం లేదు. రేపు జరగనున్న ఈవెంట్ కైనా ఈ అమ్మాయి వస్తుందేమో చూడాలి.    
Nani
Sai Pallavi
Krithi Shetty
Madonna
Shyam Singha Roy Movie

More Telugu News