Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు

Raghu Rama Krishna Raju receives grand welcome form Amaravati farmers
  • అమరావతి సభకు హాజరైన రఘురాజు
  • ఇది దగాపడ్డ రైతుల సభ అన్న రఘురాజు
  • ఎవరో చెప్పమన్నట్టుగా బొత్స మాట్లాడుతున్నారు
తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన సభకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది రాజకీయ సభ కాదని, దగాపడ్డ రైతుల సభ అని చెప్పారు. రైతులకు మద్దతుగా అన్ని వర్గాలు తరలి వస్తున్నాయని అన్నారు. వంద శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు. అమరావతే శాశ్వతమని, అడ్డుపడే మేఘాలు అశాశ్వతమని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మంచివాడని తాను చెప్పనని, చెడ్డవాడు మాత్రం కాదని చెప్పారు. ఎవరో చెప్పమన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. కాసేపటి క్రితం ఆయన వేదికపైకి వచ్చారు.
Raghu Rama Krishna Raju
Amaravati
Tirupati

More Telugu News