ఇక పుట్టిన వెంటనే ఆధార్.. ఆసుపత్రుల్లోనే జారీకి సన్నాహాలు
- ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌తో పనిలేదు
- తొలుత కేటాయించి, ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ సేకరణ
- రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్‌తో యూఐడీఏఐ సంప్రదింపులు
ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్ అవసరం లేదు కాబట్టి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆధార్ కార్డుతో దానిని అనుసంధానిస్తామని అన్నారు. ఐదేళ్ల తర్వాత మాత్రం బయోమెట్రిక్ తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే దేశంలోని 99.7 శాతం (137 కోట్లు) మందికి ఆధార్ కార్డులు జారీ చేసినట్టు చెప్పారు. ప్రతి సంవత్సరం రెండు నుంచి రెండున్నర కోట్ల మంది జన్మిస్తున్నారని, వారికి పుట్టిన వెంటనే ఆధార్ జారీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు సౌరభ్ గార్గ్ పేర్కొన్నారు.