ఫేస్ బుక్ తో కలిసి రేబాన్ తయారుచేసిన కొత్త కళ్లజోడు నిజంగా వెరీ స్మార్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్ బుక్ తో కలిసి రేబాన్ తయారుచేసిన కొత్త కళ్లజోడు నిజంగా వెరీ స్మార్ట్!

Rayban Stories smart glasses developed by Rayban with Facebook
  • రేబాన్ స్టోరీస్ పేరిట స్మార్ట్ గ్లాసెస్ తయారీ
  • కళ్లజోడులోనే ఫోన్
  • ధర రూ.22 వేల నుంచి ప్రారంభం
  • త్వరలోనే భారత్ మార్కెట్లో ప్రవేశం
రేబాన్ కళ్లజోళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని వయసుల వారికి ఓ ఠీవీని తెచ్చిపెట్టే ఈ అంతర్జాతీయ బ్రాండ్ తాజాగా ఫేస్ బుక్ తో చేతులు కలిపింది. నెక్ట్స్ జనరేషన్ కళ్లజోడు అనదగ్గ రీతిలో స్మార్ట్ గ్లాసెస్ కు రూపకల్పన చేసింది. ఈ కళ్లజోడుకు 'రేబాన్ స్టోరీస్' గా నామకరణం చేశారు.

రేబాన్ స్టోరీస్ కేవలం కళ్లజోడు మాత్రమే కాదు, ఇదొక స్మార్ట్ ఫోన్ కూడా. ఇందులో ఫోన్ కాల్స్ కోసం 3 మైక్రోఫోన్లు, రెండు వైపులా స్పీకర్లు, కుడివైపున టచ్ కంట్రోల్స్, ఫొటోలు తీసుకోవడానికి వీలుగా ఫ్రేమ్ కు రెండు వైపులా 5 ఎంపీ సామర్థ్యంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశారు.

తాజాగా ఈ స్మార్ట్ గ్లాసెస్ కు సంబంధించిన మరో ఫీచర్ ను  మార్క్ జుకర్ బర్గ్ పరిచయం చేశారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా ఫేస్ బుక్ మెసెంజర్ ను కూడా ఉపయోగించవచ్చు. మెసెంజర్ లో సందేశాలు పంపడం, స్వీకరించడం సాధ్యమవుతుందని జుకర్ బర్గ్ వెల్లడించారు.

రేబాన్ గ్లాసెస్ ను 6 వేరియంట్లలో తీసుకువస్తున్నారు. వీటిని గత సెప్టెంబరులో అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇటలీ, ఐర్లాండ్, కెనడా దేశాల్లో తీసుకువచ్చారు. త్వరలోనే భారత్ లోనూ ప్రవేశపెట్టనున్నారు. భారత్ లో ఇవి రూ.22 వేల నుంచి రూ.28 వేల మధ్య లభ్యమవుతాయని తెలుస్తోంది.
Rayban Stories
Smart Glasses
Rayban
Facebook
Meta

More Telugu News