Andhra Pradesh: ఏపీలో కొత్తగా 148 మందికి కరోనా.. అప్డేట్స్ ఇవిగో!

AP records 148 new corona cases
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గత 24 గంటల్లో 33,043 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 34 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గత 24 గంటల్లో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,75,419కి చేరుకుంది. ఇప్పటి వరకు 20,59,131 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు మొత్తం 14,474 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News