సుప్రీంకోర్టులో శిల్పాశెట్టి భర్తకు ఊరట

  • పోర్న్ వీడియోల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా
  • బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన బాంబే హైకోర్టు
  • నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మరో నాలుగు వారాల పాటు ఆయనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలను జారీ చేసింది. పోర్న్ వీడియోల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత జులైలో ఆయనను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టులో రాజ్ కుంద్రా నవంబర్ 25న పిటిషన్ వేశారు. అయితే, ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం, సైబర్ క్రైమ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

Shilpa Shetty
Husband
Raj Kundra
Bail
Bollywood

More Telugu News