నానిగారు అంటే నాకు ఎంతో ఇష్టం.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా: కృతి శెట్టి

Shyam Singha Roy movie update
  • నానితో చేయడం అదృష్టం 
  • రాహుల్ కి కాన్ఫిడెంట్ ఎక్కువ 
  • ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ 
  • మాస్క్ పెట్టుకుని చూడండి
నాని హీరోగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చేశాడు. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై కృతి శెట్టి తెలుగులో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.

"నాని అంటే నాకే కాదు మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. రెండవ సినిమాతోనే నానితో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాని గారి నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది.

రాహుల్ గారికి ఇది రెండవ సినిమా. అయినా ఎక్కడా కూడా అలా అనిపించలేదు. తన వర్క్ కి సంబంధించి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కనిపించే వారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు కీర్తి .. మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. అందరూ కూడా మాస్క్ పెట్టుకుని థియేటర్ కి వెళ్లి ఈ సినిమాను చూడండి .. ఈ సినిమా తప్పకుండా మీకు ఒక విజువల్ ట్రీట్ ఇస్తుంది" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
Nani
Krithi Shetty
Sai Pallavi
Shyam Singha Roy Movie

More Telugu News