Venky Kudumula: జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది: వెంకీ కుడుముల

Venky Kudumula on cloud nine after getting chance to direct Megastar Chiranjeevi
  • చిరంజీవి 156వ చిత్రం ప్రకటన
  • దర్శకుడిగా వెంకీ కుడుముల
  • ఆనందంతో పొంగిపోతున్న వెంకీ
  • గతంలో ఛలో, భీష్మ చిత్రాలు చేసిన యువ దర్శకుడు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసే అవకాశం వస్తే ఏ దర్శకుడికైనా అది పండుగ లాంటి విషయమే. అయితే కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న వెంకీ కుడుముల వంటి డైరెక్టెర్ కు అలాంటి గోల్డెన్ చాన్స్ వస్తే ఇక చెప్పనక్కర్లేదు! చిరంజీవి 156వ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం వెంకీ కుడుములకు దక్కింది.

దీనిపై వెంకీ కుడుముల ఏమంటున్నాడంటే... "జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్యూ చిరంజీవి సర్. మీపై నాకున్న అభిమానం, నాపై మీరు చూపుతున్న నమ్మకం ఈ చిత్రాన్ని నా సర్వశక్తులు ధారపోసి తెరకెక్కించేలా నన్ను నడిపిస్తాయని నమ్ముతున్నాను. నా కల సాకారం అయ్యేలా చేసిన డీవీవీ మూవీస్ కు, డాక్టర్ మాధవి రాజు గారికి కృతజ్ఞతలు" అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వెలిబుచ్చారు.
Venky Kudumula
Chiranjeevi
Chiru156
DVV Entertainments
Tollywood

More Telugu News