దక్షిణాఫ్రికా టూర్ ముంగిట టీమిండియాకు ఎదురుదెబ్బ... గాయంతో రోహిత్ శర్మ దూరం
- ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్
- ముంబయిలో టీమిండియా ప్రాక్టీసు
- తొడ కండరాల గాయానికి గురైన రోహిత్
- రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్ ఎంపిక
అయితే, ముంబయిలో నెట్ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దాంతో అతడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు దూరమయ్యాడని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. టెస్టు జట్టులో రోహిత్ శర్మ స్థానాన్ని గుజరాత్ ఆటగాడు ప్రియాంక్ పాంచల్ తో భర్తీ చేస్తున్నామని తెలిపింది.