'శ్యామ్ సింగ రాయ్' నుంచి కొత్త పోస్టర్!
- విభిన్నమైన కథాంశంతో నాని సినిమా
- కలకత్తా నేపథ్యంలో నడిచే కథ
- నాని సరసన ముగ్గురు నాయికలు
- ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 14వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్నారు. ఈ వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. నాని - సాయిపల్లవి జంటగా కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది .. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాను కలకత్తా సమీపంలోని గ్రామంలోను .. హైదరాబాద్ సమీపంలో 10 ఎకరాల్లో వేసిన సెట్లోను చిత్రీకరించారు. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కూడా ఇందులో కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని నాని భావిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.