V Hanumantha Rao: అమర జవాన్ సాయితేజ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు హాజరుకాకపోవడం దురదృష్టకరం: వి.హనుమంతరావు

Very sad that AP ministers not attended Soldier Sai Teja says V Hanumantha Rao
  • హెలికాప్టర్ దుర్ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ దుర్మరణం
  • సాయితేజ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేసిన వీహెచ్
  • అమర సైనికులను గౌరవించుకోవాలని సూచన

తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు మురో 12 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా అమరుడైన సంగతి తెలిసిందే. సాయితేజ స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. అయితే, ఈ అంత్యక్రియలకు ఏపీకి చెందిన ఒక్క మంత్రి కూడా హాజరుకాకపోవడం దురదృష్టకరమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

మరోవైపు ఇదే సమయంలో టీఎస్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సాటి తెలుగువాడిగా సాయితేజ పట్ల గౌరవాన్ని ప్రకటించాల్సిన బాధ్యత కేసీఆర్ కు లేదా? అని ప్రశ్నించారు. పీవీ సింధు, సానియామీర్జాలకు కోట్ల రూపాయలను ఇచ్చిన కేసీఆర్... అమర జవాన్ సాయితేజ కుటుంబానికి ఇవ్వరా? అని అడిగారు. దేశ యువతకు మంచి సందేశాన్ని ఇవ్వాలంటే అమర సైనికులను  గౌరవించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News