Samantha: సమంత ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దు: మేనేజర్ వివరణ

Samantha manager condemns rumors on actress health
  • సమంత ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారం
  • ఖండించిన సమంత మేనేజర్ మహేంద్ర
  • సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి
  • నిన్న దగ్గు రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు వివరణ
టాలీవుడ్ అందాలభామ సమంత ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆమె మేనేజర్ మహేంద్ర స్పందించారు. సమంత పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారని వెల్లడించారు. నిన్న కొంచెం దగ్గు రావడంతో హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. సమంత ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని మహేంద్ర పేర్కొన్నారు.

సమంత నిన్న కడపలో పర్యటించడం తెలిసిందే. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత కడప పెద్ద దర్గాను కూడా ఆమె సందర్శించారు.
Samantha
Health
Rumors
Manager
Tollywood

More Telugu News