Woman: మహిళకు మధ్యవేలు చూపించినందుకు ఆరునెలల జైలుశిక్ష

Court gives punishment to a man who showed middle finger to woman
  • రోడ్డుపై అడ్డదిడ్డంగా వచ్చారంటూ గొడవ
  • కారులోని మహిళకు మధ్య వేలు చూపించిన 33 ఏళ్ల వ్యక్తి
  • పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ
ఒక మహిళకు అసభ్యకరంగా మధ్య వేలు చూపించిన ఓ వ్యక్తికి ముంబైలోని ఓ కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళ్తే 2018 సెప్టెంబర్ 17న ఓ మహిళ తన కుమారుడితో కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుండగా అకస్మాత్తుగా ఎడమ వైపు నుంచి మరో కారు వారి కారు ముందుకు వచ్చింది. దీంతో వారు కంట్రోల్ కోల్పోయారు. ఆమె కారు 100 మీటర్ల వరకు అడ్డదిడ్డంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత ఎలాగోలా కంట్రోల్ లోకి వచ్చింది. ఆ తర్వాత సిగ్నల్ వద్దకు వచ్చి ఆగింది.

అదే సమయంలో మరో కారు వచ్చి వారి కారు పక్కన ఆగింది. అయితే సదరు మహిళ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వచ్చిందంటూ కారులోని 33 ఏళ్ల వ్యక్తి వారిని దూషిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా... ఆమె కుమారుడు తమ కారును ఆ వ్యక్తి కారుకు అడ్డుగా పెట్టాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది.

ఆ తర్వాత పోలీసులు సీన్ లోకి ఎంటరై తల్లీకుమారులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అయితే, వాదనలు జరుగుతున్న సమయంలో మహిళకు ఆ యువకుడు మధ్య వేలిని చూపించాడు. దీంతో, ఆ యువకుడిపై సదరు మహిళ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును విచారించిన కోర్టు యువకుడికి శిక్షను విధించింది.
Woman
Man
Middle Finger

More Telugu News