ఏపీలో కొత్తగా 156 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,131 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 156 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 31, పశ్చిమ గోదావరి జిల్లాలో 27, గుంటూరు జిల్లాలో 24, కృష్ణా జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం, కర్నూలు జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు. అదే సమయంలో 188 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,289 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,954 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనాతో మరణించినవారి సంఖ్య 14,465కి పెరిగింది.

Andhra Pradesh
COVID19
Daily Report
Today Cases

More Telugu News