Maradona: చోరీకి గురైన ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా గడియారం అసోంలో లభ్యం

Maradona branded watch found in Assam
  • గతేడాది గుండెపోటుతో మరణించిన మారడోనా
  • దుబాయ్ లోని ఓ లాకర్లో మారడోనా వస్తువులు
  • హుబ్లోట్ వాచ్ మాయం
  • గడియారం ఖరీదు రూ.20 లక్షలు

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనాకు చెందిన ఖరీదైన వాచ్ కొంతకాలం కిందట మాయమైంది. ఇప్పుడా గడియారం అసోంలో లభ్యమైంది. మారడోనా గతేడాది గుండెపోటుకు గురై మరణించాడు. ఆయనకు చెందిన పలు ఖరీదైన వస్తువులు దుబాయ్ లోని ఓ లాకర్ లో భద్రపరిచారు.

అయితే అందులోని హుబ్లోట్ కంపెనీ బ్రాండెడ్ వాచ్ అదృశ్యమైంది. దీని ఖరీదు రూ.20 లక్షలు. ఇటీవల దుబాయ్ నుంచి అసోం తిరిగివచ్చిన వాజిద్ హుస్సేన్ ఓ కార్మికుడి వద్ద దీన్ని గుర్తించారు. దుబాయ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.

  • Loading...

More Telugu News