Peddireddi Ramachandra Reddy: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల చెక్ అందించిన మంత్రి పెద్దిరెడ్డి

AP Minister Peddireddy handed over cash cheque to lance naik Saiteja family members
  • తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం
  • సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల సహా 13 మంది మృతి
  • చనిపోయిన వారిలో ఏపీకి చెందిన లాన్స్ నాయక్
  • రావత్ వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్న సాయితేజ
  • రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించిన సీఎం జగన్
తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల సహా 13 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. మరణించినవారిలో ఏపీకి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ... జనరల్ బిపిన్ రావత్ కు వ్యక్తిగత భద్రతాధికారిగా వ్యవహరిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో సాయితేజ కుటుంబానికి ఏపీ సీఎం జగన్ రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు సాయితేజ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల చెక్ ను అందజేశారు. తీవ్ర విషాదంలో ఉన్న సాయితేజ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సాయితేజ భౌతికకాయాన్ని నేడు డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. స్వస్థలంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Peddireddi Ramachandra Reddy
Saiteja
Cash Cheque
Lance Naik
Chittoor District
Helicopter Crash

More Telugu News