రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నివాసంతో పాటు గంటా సుబ్బారావు ఇంట్లోనూ సీఐడీ సోదాలు
- ఏపీ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ లో అవకతవకలు?
- రూ.241 కోట్ల నిధుల దుర్వినియోగం
- గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సోదాలు
- కొనసాగుతోన్న దర్యాప్తు
ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. ఏపీ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. దీనిపైనే సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగానే ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు హయాంలో ఐటీ సలహాదారుగాను, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు. దాదాపు పది గంటల పాటు సోదాలు జరిగాయి.