'సునీల్ యాక్టింగ్ అదుర్స్' అంటున్న బన్నీ!

Pushpa movie update
  • 'పుష్ప'గా అల్లు అర్జున్
  • ఈ నెల 12న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 17వ తేదీన సినిమా విడుదల  
  • మంగళం శ్రీను పాత్రలో సునీల్
అల్లు అర్జున్ - రష్మిక జంటగా 'పుష్ప' సినిమా నిర్మితమైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో సునీల్ 'మంగళం శ్రీను' అనే పాత్రలో నటించాడు. ఇటీవలే ఆయన పాత్ర పేరును పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హెయిర్ స్టైల్ .. మీసకట్టు .. లుక్స్ పరంగా ఆయన ఆకట్టుకున్నాడు. ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత, చిత్తూరు యాసతో కూడిన ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందనే విషయం అర్థమైంది.

ఇటీవల డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన బన్నీ, తనకంటే ముందుగానే సునీల్ డబ్బింగ్ చెప్పేసిన సీన్స్ ను చూశాడట. సునీల్ నటన మామూలుగా లేదు .. అదరగొట్టేశాడని సుకుమార్ తో చెప్పాడట. సునీల్ పాత్ర అంత బాగా వస్తుందనీ .. అంత బాగా చేస్తాడనని తాను ఎంతమాత్రం ఊహించలేదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sunil
Anasuya
Pushpa Movie

More Telugu News