rain: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌ళ్లీ వ‌ర్ష సూచ‌న‌

rains in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను వ‌ర్షాలు వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం కూడా ఏదో ఒక జిల్లాలో వ‌ర్షాలు ప‌డుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నేడు, రేపు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో తేలికపాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఏపీ తీర ప్రాంతాల్లో స‌ముద్ర మ‌ట్టానికి 0.9 కిలోమీట‌ర్ల ఎత్తులో ద్రోణి వ్యాపించింద‌ని వివ‌రించారు. ఈ కార‌ణంగానే వ‌ర్షాలు కురుస్తాయ‌ని పేర్కొన్నారు.
Go Back to Shorts
rain
Andhra Pradesh
Amaravati

More Telugu News