తగ్గని 'అఖండ' జోరు.. ప్యారిస్ లో ప్రత్యేక షోకు సర్వం సిద్ధం!
- బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న 'అఖండ'
- వంద కోట్ల క్లబ్ దిశగా బాలయ్య సినిమా
- ప్యారిస్ లో ఈ రాత్రికి స్పెషల్ షో
తాజాగా ఇతర దేశాల్లో ఉంటున్న వారు కూడా డిమాండ్ చేస్తుండటంతో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో 'అఖండ' ప్రత్యేక షో వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. ప్యారిస్ లోని పాథే లా విల్లెట్ థియేటర్ లో 'అఖండ' షో వేసేందుకు నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.45 గంటలకు స్పెషల్ షో వేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా కొనసాగుతున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ ప్రధాన పాత్రలను పోషించారు.