భద్రాచలం సీతారామచంద్ర స్వామికి మంత్రి కొడాలి నాని కానుక!
- కుటుంబ సమేతంగా భద్రాద్రి రాముడిని దర్శించుకున్న కొడాలి నాని
- రూ. 13 లక్షల విలువ చేసే కిరీటం సమర్పణ
- తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించానని వ్యాఖ్య
అనంతరం మీడియాతో కొడాలి నాని మాట్లాడుతూ, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించానని తెలిపారు. ఏపీ ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలనేదే జగన్ ఆకాంక్ష అని చెప్పారు.