టీడీపీ నేతలపై కేసుల్లో తొందరపాటు చర్యలొద్దు: పోలీసులకు హైకోర్టు ఆదేశం
- భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపాత్రుడు సహా టీడీపీ నేతల ఆందోళన
- పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు
- తొలుత నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని ఆదేశం
సీఆర్‌పీసీ 41ఏ కింద తొలుత నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించిన కోర్టు.. అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అయ్యన్నపాత్రుడు, ఇతర టీడీపీ నేతల ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని, పోలీసు వ్యవస్థకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ నర్సీపట్నం ఎస్సై లక్ష్మణరావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు సహా టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.