Team India: ​ఐసీసీ ర్యాంకింగ్స్: నెంబర్ వన్ స్థానంలో టీమిండియా

Team India back into number one position in ICC Test Rankings
  • కివీస్ పై ముంబయి టెస్టులో సూపర్ విక్టరీ
  • టెస్టు ర్యాంకులు ప్రకటించిన ఐసీసీ
  • భారత్ ఖాతాలో 124 రేటింగ్ పాయింట్లు
  • రెండో స్థానంలో న్యూజిలాండ్
న్యూజిలాండ్ పై ముంబయి టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో తిరిగి నెంబర్ వన్ స్థానానికి ఎగబాకింది. ముంబయిలో నాలుగో రోజే ముగిసిన టెస్టులో భారత్ 372 పరుగుల భారీ తేడాతో కివీస్ ను చిత్తుచేసింది. ఈ క్రమంలో కొద్దిసేపటి కిందట ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. 124 రేటింగ్ పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ (121) రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) టాప్-5లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అటు, ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్(2021-23) లో భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.  తాజా సీజన్ లో వందశాతం విజయాలతో శ్రీలంక అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో పాకిస్థాన్ ఉంది.

Team India
Rankings
ICC
No.1
New Zealand

More Telugu News