మాజీ సీఎం రోశయ్య భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
- అమీర్ పేటలో రోశయ్య పార్థివదేహం
- ఈ మధ్యాహ్నం అంత్యక్రియలు
- హాజరుకానున్న ఏపీ మంత్రులు
- రోశయ్యకు కిషన్ రెడ్డి, చిరంజీవి నివాళి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... రోశయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ ప్రజలకు రోశయ్యలేని లోటు తీర్చలేనిదని అన్నారు. అసెంబ్లీలో రాజకీయంగా ఘర్షణ పడినా, తాము శత్రువులం మాత్రం కాదని చెప్పారు. నాడు వైఎస్ కు రోశయ్య ఓ రక్షక కవచంలా ఉండేవారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, సొంత వ్యవసాయక్షేత్రంలో ఈ మధ్యాహ్నం రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీ మంత్రులు అంత్యక్రియలకు కూడా హాజరుకానున్నారు.