రోశయ్య భౌతికకాయానికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్
- రోశయ్య నివాసానికి వెళ్లిన కేసీఆర్
- కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం
- రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎంకు తెలిపిన కుటుంబసభ్యులు
అంతకు ముందు రోశయ్య మరణ వార్త తెలియగానే కేసీఆర్ స్పందించారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో రోశయ్య తనదైన ముద్ర వేశారని ఆయన కొనియాడారు. మంత్రిగా, ఉమ్మడి ఏపీ సీఎంగా, గవర్నర్ గా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించారని... ఆయన మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని అన్నారు. రోశయ్య మరణ వార్త తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.