CM Jagan: ఓ కిడ్నీ వ్యాధిగ్రస్తురాలికి సీఎం జగన్ భరోసా

CM Jagan assures  financial help to a kidney deceased woman
  • చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
  • బి.కుసుమ అనే కిడ్నీ వ్యాధిగ్రస్తురాలికి పరామర్శ
  • ఆమె పరిస్థితి పట్ల చలించిపోయిన జగన్
  • చికిత్సకు ఆర్థికసాయం అందిస్తామని హామీ
ఏపీ సీఎం జగన్ ఇవాళ చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బి.కుసుమ అనే కిడ్నీ వ్యాధిగ్రస్తురాలి ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం కుసుమ కనీసం నడవలేని స్థితిలో ఉండడం పట్ల సీఎం జగన్ చలించిపోయారు.

ఆమెకు తక్షణమే వైద్య చికిత్స అవసరమని తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆమె చికిత్సకు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు కుసుమ రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
CM Jagan
Kusuma
Kidney Patient
Financial Help
Andhra Pradesh

More Telugu News