65 ఏళ్ల వయసులో పెళ్లాడి ప్రేమను పరిపూర్ణం చేసుకున్న జంట
- కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఘటన
- సమాజ కట్టుబాట్లను పక్కన పెట్టి 65 ఏళ్ల వయసులో పెళ్లి
- సామాజిక మాధ్యమాల్లో పెళ్లి ఫొటోలు చక్కర్లు
కర్ణాటకలోని మాండ్య జిల్లా మేలుకోటెలో జరిగిందీ ఘటన. మైసూరులోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ (65) మేలుకోటె చెలువనారాయణస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమను పండించుకున్న ఈ దంపతుల ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతున్నాయి.