Jakkula Nageswararao: టాలీవుడ్ లో మరో విషాద ఘటన... డబ్బింగ్ చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వరరావు మృతి

Tollywood producer Jakkula Nageswararao died in a road accident
  • ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు
  • శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల కన్నుమూత
  • తాజాగా నిర్మాత జక్కుల దుర్మరణం
  • కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఇటీవల శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖుల మరణాలతో తీవ్ర విషాదంలో ఉన్న చిత్ర పరిశ్రమను మరో ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జక్కుల నాగేశ్వరరావు ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. నిర్మాత నాగేశ్వరరావుకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడిక్కడే మరణించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం అలముకుంది. జక్కుల నాగేశ్వరరావు లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మా నాన్నా ఊరెళితే వంటి చిత్రాలను తెలుగులో విడుదల చేశారు.
Jakkula Nageswararao
Death
Road Accident
Tollywood

More Telugu News