Devi Sri Prasad: ఈ పాటను సీతారామశాస్త్రి అంకుల్ కు అంకితం ఇస్తున్నాం: దేవి శ్రీ ప్రసాద్

Devi Sri Prasad said they dedicates Inthandamgaa song to Sirivennela
  • తీవ్ర అనారోగ్యంతో సిరివెన్నెల కన్నుమూత
  • నేడు 'గుడ్ లక్ సఖి' చిత్రం నుంచి పాట విడుదల
  • ఇంతందంగా అంటూ సాగే పాటకు శ్రీమణి సాహిత్యం
  • పాటను ఆలపించిన దేవి శ్రీ ప్రసాద్
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నగేశ్ కుకునూర్ దర్శకుడు. కాగా, ఈ చిత్రబృందం నేడు 'ఇంతందంగా' అనే పాటను విడుదల చేసింది. దీనిపై చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్పందించారు.

"ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి అంకుల్ కు అంకితం ఇస్తున్నాం. నా గొంతు బాగుంటుందని ఆయన ఎప్పుడూ మెచ్చుకునేవారు. ఈ పాటను నేనే పాడాను. అందుకే ఈ పాటనే ఆయనకు అంకితం ఇవ్వాలని నిర్ణయించాం" అని దేవి శ్రీ ప్రసాద్ వివరించారు. కాగా, 'ఇంతందంగా' అంటూ సాగే ఈ గీతానికి శ్రీమణి అందమైన సాహిత్యం అందించారని దేవి శ్రీ ప్రసాద్ కొనియాడారు.

సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Devi Sri Prasad
Inthandamgaa
Dedication
Sirivennela
Good Luck Sakhi
Keerthy Suresh
Tollywood

More Telugu News