ఏపీలో మరో 159 మందికి కరోనా పాజిటివ్
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 29,263 కరోనా పరీక్షలు
- విశాఖ జిల్లాలో 28 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 2,138 మందికి చికిత్స
అదే సమయంలో 169 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,252 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,56,670 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,138 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,444కి పెరిగింది.