ఏపీలో మరో 159 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 29,263 కరోనా శాంపిళ్లు పరీక్షించగా, 159 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 28 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 169 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,252 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,56,670 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,138 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,444కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Media Report
Today Cases

More Telugu News