ఢిల్లీలో గాలి మళ్లీ విషం.. 400కుపైనే ఏక్యూఐ!
- నోయిడాలో 479గా నమోదు
- వివేక్ విహార్ లో 471.. ఆనంద్ విహార్ లో 451
- మిగతా చోట్ల 312గా నమోదు
నోయిడాలో 479, వివేక్ విహార్ ప్రాంతంలో 471, ఆనంద్ విహార్ లో 451గా ఏక్యూఐ రికార్డయింది. లోధి రోడ్డులో 339గా నమోదైంది. గాలుల వేగం అత్యంత తక్కువగా ఉండడంతో కాలుష్య కారకాలన్నీ గాలిలో చేరాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, దాని వల్ల గాలి శుభ్రమవుతుందని అన్నారు.