అమెరికాలోని స్కూల్లో కాల్పులు.. ముగ్గురు విద్యార్థుల మృతి
- డెట్రాయిట్కు 48 కిలోమీటర్ల దూరంలోని ఆక్స్ఫర్డ్లో ఘటన
- పోలీసుల అదుపులో 15 ఏళ్ల కుర్రాడు
- 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు
- సెమీ ఆటోమెటిక్ హ్యాండ్ గన్ స్వాధీనం
దుండగుడి కాల్పుల్లో గాయపడిన వారిలో ఓ టీచర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు చేరుకున్న పోలీసులు అనుమానితుడైన 15 ఏళ్ల కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఓ సెమీ ఆటోమెటిక్ హ్యాండ్గన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.